VAMSHI: వంశీ ఫోన్ కోసం పోలీసుల వేట..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు... ఆయన ఫోన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు వచ్చినట్లు తెలుస్తోంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు.. వంశీ ఇంట్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జైల్లో వల్లభనేని వంశీ వీరంగం...?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో వీరంగం సృష్టించారన్న వార్తలు వస్తున్నాయి. నడుం నొప్పి ఉందంటూ తనకు ప్రత్యేక మంచం కావాలని వంశీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. జైలు వైద్యుడి పరీక్ష అనంతరం ప్రత్యేక మంచం కేటాయించేందుకు జైలు అధికారులు నిరాకరించినట్లు సమాచారం. జైలు బ్యారక్ లోని తన గది శుభ్రంగా లేదని.. తనకు వేరే గది కేటాయించాలని కూడా వంశీ కోరినా జైలు అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
వంశీ అరెస్టుతో న్యాయం గెలిచింది
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ని కూటమి ప్రభుత్వం కక్షతో అక్రమంగా అరెస్టు చేసిందని సజ్జల రామకృ ష్ణారెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు పేర్కొన్నారు. గుడివాడ ధనియాలపేటలోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వంశీ అరెస్టుతో న్యాయం గెలిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కేసులను బనాయించిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com