నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?

చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్య కేసులో పురుషోత్తం, పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేశారు. పురుషోత్తంనాయుడును ఏ1గా, పద్మజను ఏ2గా పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన సమయంలో పద్మజ.. తనకు ఈ ఒక్క రోజు అవకాశం ఇవ్వాలని.. రేపటిలోగా తన బిడ్డలు బతికి వస్తారంది. అటు కరోనా టెస్టుకు పద్మజ సహకరించలేదు.
కరోనా చైనా నుంచి రాలేదని, శివుడి శరీరం నుంచి వచ్చిందంటూ.. 'నేనే శివుడిని.. నాకు టెస్టు ఏంటి.. నా గొంతులో హాలాహలం ఉంది' అంటూ విచిత్రంగా ప్రవర్తించింది. చెత్తను కడిగేయడానికి తన శరీరం నుంచి కరోనాను పంపించానంది. దీంతో పోలీసు వాహనం వద్దే పద్మజకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కాగా, ఆదివారం రాత్రి తమ ఇద్దరు కూతుళ్లు అయిన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను మూఢనమ్మకాల పేరుతో పురుషోత్తం, పద్మజ హత్య చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com