Political: పొత్తు విషయం పవనే చెప్పాలి: సోమువీర్రాజు

X
By - Subba Reddy |26 Jan 2023 5:45 PM IST
త్వరలో చలో తిరుపతి కార్యక్రమం
ఒంగోలులో బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కళ్యాణే చెప్పాలని వ్యాఖ్యానించారు. కన్నా అనుచరుల ఆరోపణలపై నో కామెంట్స్ అన్న సోము వీర్రాజు.. జగన్ సర్కారుపై మండిపడ్డారు. కేంద్ర పథకాలనే జగన్ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తిరుమలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. త్వరలో చలో తిరుపతి కార్యక్రమాన్ని చేపడతామని వీర్రాజు వెల్లడించారు. పారిశ్రామిక విధానంపై జగన్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com