హిందూపురంలో పొలిటికల్ రగడ

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో పొలిటికల్ రగడ హీట్ పుట్టిస్తోంది. నిన్నటి నుంచి ఫ్లెక్సీ వివాదం కొనసాగుతోంది. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ను కించపరిచేలా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంపై టీడీపీ, జనసేన వర్గాలు మండిపడ్డారు. వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీల తొలగింపునకు టీడీపీ, జనసేన శ్రేణులు యత్నించగా.. వైసీపీ వర్గాలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో రెండు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు.
టీడీపీ, జనసేన వర్గీయులపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు టీడీపీ, ఏడుగురు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం ఉదయం 10 మందిని అదనపు జడ్జి రాజ్యలక్ష్మి ముందు పోలీసులు హాజరు పర్చగా.. వారికి బెయిల్ మంజూరు చేశారు. అటు వైసీపీ ర్యాలీకి పోటీగా జనసేన మరో ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు హిందూపురం చేరుకుంటున్నారు. కావాలనే వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి వైసీపీ వర్గాల తీరుతో హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com