ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్‌ కలకలం

ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్‌ కలకలం

ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్‌ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్‌ పంపాడు.. దీనికి సమాధానంగా ఎస్వీబీసీ ఉద్యోగి రిప్లై మెయిల్‌ పంపగా.. అందులో పోర్న్‌ సైట్‌ లింక్‌ ప్రత్యక్షమైంది.. దీనిపై టీటీడీ ఛైర్మన్‌, ఈవోకు భక్తుడు ఫిర్యాదు చేశాడు.. అటు ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్‌, సైబర్‌ క్రైమ్‌ టీమ్‌తోపాటు ఈడీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.. పోర్న్‌ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్‌ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధమవుతోంది.

Tags

Next Story