పోర్న్‌ వీడియో పంపిన ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీటీడీ

పోర్న్‌ వీడియో పంపిన ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీటీడీ

ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్ లింక్‌లను భక్తుడికి పంపిన ఘటన కలకలం రేపుతోంది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్‌ పంపాడు.. దీనికి సమాధానంగా ఎస్వీబీసీ ఉద్యోగి రిప్లై మెయిల్‌ పంపగా.. అందులో పోర్న్‌ సైట్‌ లింక్‌ ప్రత్యక్షమైంది.

ఎస్వీబీసీలో పనిచేసే ఉద్యోగి పోర్న్‌ లింక్‌లు పంపటం నిజమేనని టీటీడీ విజిలెన్స్‌ విచారణలో తేలింది. పోర్న్‌ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్‌ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధమవుతోంది.

అటు.. ఎస్వీబీసీలో పోర్న్‌సైట్లు చూడడం కొందరు ఉద్యోగులకు అలవాటుగా మారిందని బీజేపీ నేత రమేష్ నాయుడు మండిపడ్డారు. ఇలాంటి ఉద్యోగులను ఏరిపారేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags

Next Story