POSANI: జైలు నుంచి పోసాని విడుదలకు బ్రేక్

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. ఆయనపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్న గుంటూరు సీఐడీ పోలీసులు.. పీటీ వారెంట్‌పై పోసానిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.
పోసాని విడుదలపై ఉత్కంఠ!
సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు కర్నూలు JFCM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు ఆయనకు మూడు కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది. లేనిపక్షంలో ఈరోజు జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోసానికి భారీ ఊరట
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. ఆదోని, విజయవాడ కోర్టులలో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే రాజంపేట, నరసరావు పేటలో ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. మొత్తంగా నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ప్రస్తుతం పోసాని కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పోసానిని పరామర్శించిన కాటసాని
కర్నూలు జిల్లా కారాగారంలో వైయస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళిని పరామర్శించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. వైయస్ఆర్సీపీ నేతలపై రాజకీయ కక్ష్యసాధింపు కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు ఉల్లంఘన కాకపోగా, వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. చట్టం అందరికీ సమానమై ఉండాలని హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com