Power Star: జగన్ ప్రభుత్వంపై పవన్ ఫైర్..

జగన్ ప్రభుత్వం పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగాడు. గురువారం మంగళగిరిలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ప్రశ్నించాడు. రాష్ట్రాన్ని, ప్రజలను విడగొట్టింది చాలు ఇక ఆపేయండన్నారు. ఎంత మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు సీమను ఎంతవరకు అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. ఏపీని మరోసారి విడగొతామంటే తోలుతీసి విరగ్గొడతామని హెచ్చరించాడు. వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరని ఘాటుగా స్పందించాడు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్ళించారని ఆరోపించాడు. బాబాయిని చంపి కేసును సీబీఐకి ఇవ్వడమేంటన్నారు. ఎవరికీ జవాబు చెప్పనక్కరలేదని వైసీపీ నాయకులంటున్నారు వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తామని, వారిది దేశీయదొరతనమని పవన్ పేర్కొన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని, వారాహిని రోడ్లమీదకు ఎలా వస్తుందో చూస్తామని వైసీపీవారు అంటున్నారని వెల్లడించాడు. ప్రధానిని కలుస్తే ఈ సారి సజ్జల, వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తానని వాఖ్యానించాడు. మంత్రి కావాలనే తన ఇల్లును తగలబెట్టించుకున్నాడు అందుకే సీఎం జగన్ అక్కడకు వెళ్లలేదని పవన్ కల్యాణ్ వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com