Prakasam: మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం

Prakasam: మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం
దాదాపు కోటిరూపాయల వరకు నష్టం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శివాలయం వీధిలోని శ్రీనివాస హార్డ్‌వేర్‌ షాపులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. షార్ట్ షర్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. షాపులో పెయింట్‌ డబ్బాలు, ప్లైవుడ్‌ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగి ఐదు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది చుట్టు పక్కల వారిని ఖాళీ చేయించి ఐదు ఫైర్‌ ఇంజన్లతో మంటార్పే ప్రయత్నం చేశారు. భవనం పై అంతస్తుల్లోకి వెళ్లే అవకాశధం లేక పోవడంతో మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు కోటిరూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని సుబ్రహ్మణ్యం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story