Prakasam Barrage:పోటెత్తిన వరదనీరు.. రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి వరద

Prakasam Barrage:పోటెత్తిన వరదనీరు.. రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి వరద
X
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ వర్షాలు, వరదలతో ప్రకాశం బ్యారేజ్‌కి ఆల్ టైం రికార్డుస్ధాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. తొలిసారి వరద నీరు 11 లక్షల క్యూసెక్కులు దాటింది.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. 125 ఏళ్ల తర్వాత బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్ధాయిలో కృష్ణమ్మకి వరద ప్రవాహం చేరింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ ఫ్లో 11.25 లక్షలు క్యూసెక్కులు దాటేసింది. 2009 సంవత్సరం అక్టోబర్ 5న వరదనీరు రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కులు దాటింది. 2009 వరదలని మించిన స్ధాయిన కృష్ణమ్మకి వరద పోటెత్తింది. అంతకముందు 1903 అక్టోబర్ 7లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.

పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో కృష్ణా పరీవాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే బుడమేరుకి గండిపడటంతో సింగ్ నగర్, ఊర్మిళా నగర్, ప్రకాశ్ నగర్, వాంబేకాలనీ, ఖండ్రిగ, పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరిపేట, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. కృష్ణలంక రైల్వే బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి అంచు వరకు వరదనీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. నీటి ప్రవాహం మరింత పెరిగితే రైల్వే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. ముందు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజీ గేటు 69ను ఢీ కొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజీ అయ్యింది.

ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యనమలకుదురు సమీపంలో రక్షణగోడకు సమాతరంగా వరద ప్రవహిస్తోంది. రక్షణగోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు.

Tags

Next Story