James : పునీత్ చివరి చిత్రం.. 4 రోజుల్లో రూ.100 కోట్లు

James :  పునీత్ చివరి చిత్రం..  4 రోజుల్లో రూ.100 కోట్లు
X
James : కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరగా నటించిన చిత్రం జేమ్స్..

Puneeth Rajkumar : కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరగా నటించిన చిత్రం జేమ్స్.. పాన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న 400 థియేటర్లలో రిలీజైంది. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.

బాక్స్‌‌ఆఫీస్ వద్ద కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్‌‌గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ సోదరులు రాఘవేంద్ర, శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రల్లో కనిపించారు.

ఇక గత ఏడాది అక్టోబర్‌‌లో గుండెపోటుతో పునీత్ మరణించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో జేమ్స్ మూవీ 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో పునీత్‌‌కి ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు.


Tags

Next Story