అఖిలప్రియకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన జైలు అధికారులు

అఖిలప్రియకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన జైలు అధికారులు
కిడ్నాప్‌ వ్యవహారంలో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు.

కిడ్నాప్‌ వ్యవహారంలో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కోర్టు ఆదేశాలతో అఖిలప్రియకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు అధికారులు. సిటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేయించగా, రిపోర్టులో ఆమె గర్భవతి కాదని వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. సోమవారం రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నారు. అటు అనారోగ్యం కారణంగా బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఇప్పటికే అఖిలప్రియ తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేయగా.. స్కానింగ్‌ రిపోర్టులు నెగెటివ్‌ రావడంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. సోమవారం బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story