గురుపూజోత్సవం నాడు రోడ్డెక్కిన ప్రైవేట్‌ టీచర్లు..

గురుపూజోత్సవం నాడు రోడ్డెక్కిన ప్రైవేట్‌ టీచర్లు..
X

కరోనా మహమ్మారి ప్రైవేట్‌ టీచర్ల జీవితాలను తలక్రిందులు చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రైవేట్‌ పాఠశాలు మూతపడడంతో.. టీచర్లకు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు. గత ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారమై.. ఏం చేయాలో తేలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీలో.. గురుపూజోత్సవం నాడు.. ప్రైవేట్‌ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట.. ప్రైవేట్‌ టీచర్లు ధర్నా చేపట్టారు. ఆరు నెలల నుంచి తమకు జీతాలు లేక కుటుంబ పోషన భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే, ఎంపీలకు ఎన్ని సార్లు వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదని వాపోతున్నారు ప్రైవేట్‌ టీచర్లు. గురుపూజోత్సవం రోజు మాకు..గురుపీడనోత్సవం అయిందంటూ అక్రందన వెల్లుబుచ్చుతున్నారు టీచర్లు.

Tags

Next Story