ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి చేదు అనుభవం

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి చేదు అనుభవం
హామీలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ధర్మశ్రీని కొండపాలెం గ్రామస్తులు నిలదీసారు. దాంతో చేసేది లేక.. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.

చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మశ్రీకి నిరసన సెగ తగిలింది. హామీలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ధర్మశ్రీని కొండపాలెం గ్రామస్తులు నిలదీసారు. దాంతో చేసేది లేక.. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని కొండపాలెం గ్రామస్తులు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. ఇంకోసారి తమ గ్రామానికి రావొద్దని చెప్పామని కొండపాలెం గ్రామస్తులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story