pulivendula: "పులివెందుల” 30 ఏళ్లుగా ఏకగ్రీవం

కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి.. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే.. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసిన అక్కడ ఏకగ్రీవమే.. అయితే, 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్ డ్రా సమయం అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రం అయ్యాయి… అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 2750 ఓట్లు సాధించింది టీడీపీ.. 1995, 2001, 2006 సంవత్సరాలలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.. 2021లో పులివెందుల జడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే, ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగదేశం భావిస్తుందట.
వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం
వులివెందుల జడ్పీటీసీ.. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా అక్కడి స్థానాన్ని ఏకగ్రీవంగా కేవసం చేసుకుంటూ వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరిగినా పులివెందులలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంది.కానీ ఈ సారి టీడీపీ అధికారంలో ఉండటం.. టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన సతీమణి లతారెడ్డిని బరిలోకి దింపడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ రోజూ ఆరోపిస్తూ వస్తోంది. రీపోలింగ్ అవసరం అయితే బుధవారం నిర్వహిస్తారు. కౌంటింగ్ గురువారం ఉంటుంది. వైఎస్ కుటుంబం ఏకతాటిపై లేకపోవడం.. పులివెందుల నియోజకవర్గాన్ని జగన్ తరపున శాసించిన వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వివేకా హత్య కేసులో బెయిల్ షరతుల కారణంగా హైదరాబాద్లోనే ఉండాల్సి రావడంతో ఎన్నికల ఫలితంపై వైసీపీలో ఉత్కంఠ ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com