Punganuru Violence: వైసీపీ శ్రేణుల హింసపై రాష్ట్రం భగ్గుమంటోంది

Punganuru Violence: వైసీపీ శ్రేణుల హింసపై రాష్ట్రం భగ్గుమంటోంది

పుంగనూరులో వైసీపీ శ్రేణుల హింసపై రాష్ట్రం భగ్గుమంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ దాడులకు పాల్పడుతోంది. పుంగనూరు భారతదేశంలో అంతర్భాగం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో విపక్షాలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. అయితే ఇటీవల ప్రతిపక్ష

నేత పర్యటనలకు వస్తున్న స్పందనను జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఇలాంటి దాడులకు దిగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం స్వంత నియోజక వర్గంలో చంద్రబాబు పర్యటనను లైట్‌ తీసుకున్న వైసీపీకి అక్కడ జన సునామీని చూసి కళ్లు భైర్లు కమ్మినట్లు ఉన్నాయని, అక్కడ దాడి చేస్తే దేశవ్యాప్తంగా చెడ్డపేరు వస్తుందని ప్లాన్‌ వేసిన అధికార పార్టీ నేతలు.. చంద్రబాబు పుంగనూరు టూర్‌ లో అటాక్‌ చేశారన్న విమర్శలు కూడా పొలిటికల్‌ సర్కిల్స్‌లో వస్తున్నారు.

అయితే ఇలాంటి ఘటనలకు భయపడకుండా టీడీపీ ఢిఫెన్స్‌ మోడ్‌ నుండి అటాక్‌ మోడ్‌ దిశగా టర్న్‌ అవుతుంది. ఇప్పటివరకు అధికార పార్టీ వైసీపీ విధ్వంసాలపై వెయిట్‌ అండ్‌ సీ దోరణిలో ఉన్న టీడీపీ ఇక అటాకింగ్‌ దిగతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణే ఇటీవల జరిగిన ఘటనలు.ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం శాంతియుతంగా ఉండాలన్న ఆదేశాలతో సైలెంట్‌గా ఉన్న కేడర్‌ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక్కసారిగా జూలు విదులుస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ అరాచకాలను అడ్డుకుంటున్నారు. తమను అడ్డుకుంటే తరిమి..తరిమి కొడతామని వార్నింగ్‌లు ఇస్తున్నారు.

మరోవైపు ఇంత కాలం దాడులు చేస్తున్నా.. సహిస్తున్నామని.. సహనానికైనా ఓ హద్దు ఉంటుందని టీడీపీ నేతలు నిరూపించారు. ఈ విషయాన్ని వైసీపీ జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్నామన్న స్పృహను మర్చిపోయి బంద్‌కు పిలుపునిచ్చారు. సాధారణంగా తమకు అన్యాయం జరిగిందని విపక్షాలు బంద్‌కు పిలుపునిస్తే నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక్కడ అధికార పార్టీనే పిలుపునిచ్చి.. అధికార పార్టీనే సక్సెస్ చేసుకుంటుంది.అధికారం పోవడం పక్కా అని ఫిక్సయిపోయి.. ఇప్పుడే పోయినట్లుగా రాజకీయం ప్రారంభించేశారని సెటైర్లు వినిపిస్తున్నాయి.

వైసీపీ అరాచకాలు విధ్వంసంపై పూతలపట్టు సభలో చంద్రబాబు నిప్పులు చెరిగారు. పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా అని ప్రశ్నించారు. రౌడీల్ని పెట్టి తనను అడ్డుకోవాలని చూస్తే పెద్దిరెడ్డికి ఇదే చివరి రోజని హెచ్చరించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని సవాలు విసిరారు. ఆఖరి ఛాన్స్ అయిపోయిందని, వైసీపీకి ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు.. పెద్దిరెడ్డి ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.

ఇక వైసీపీ సర్కార్‌ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.ఇలాంటి సంఘటనలకు భయపడేది లేదని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.నువ్వు కర్రతో వస్తే.. నేనూ కర్రతోనే వస్తా. నువ్వు యుద్ధం ప్రక టిస్తే.. నేనూ ప్రకటిస్తా! అంటూ అధికార పార్టీ నేతలకు సూటిగా హెచ్చరికలు చేశారు.గాయపడిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్తల రక్తపు బొట్టుకు బాకీ తీర్చుకుంటా’అని హెచ్చరించారు.

Tags

Next Story