కార్యాలయంలో కొండ చిలువ..

కార్యాలయంలో కొండ చిలువ..
X
భారీ వర్షాలకు, వరదలకు పాములు కొట్టుకువచ్చి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి

విశాఖలో కొండ చిలువ హల్ చల్ చేసింది. గాజువాక ఆటోనగర్ డి-బ్లాకులోని ఓ సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి 10 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షమై అలజడి సృష్టించింది. కొండ చిలువను చూసిన కంపెనీ భద్రతా సిబ్బంది వెంటనే స్నేక్ సేవా సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సొసైటీ ప్రతినిధి చాకచక్యంగా కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేసారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పాములు కొట్టుకువచ్చి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. మూడు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో కొండ చిలువ కనిపించింది. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటీలో కొండ చిలువ కొట్టుకు వచ్చింది. పొలాల పక్కన సంచరిస్తున్న కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Tags

Next Story