Raghu Rama Krishna Raju : కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషీలకు.. ఎంపీ రఘురామ లేఖలు

Raghu Rama Krishna Raju : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ సారి కేంద్ర న్యాయ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీలకు లేఖలు రాశారు. ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జనవరి 27న మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. మండలి నిర్వహణ అనవసర ఆర్ధిక భారం తప్ప ప్రయోజనం లేదన్న తమ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయన్ని ఆమోదించాలని కోరారు రఘురామకృష్ణరాజు. జూలై 19న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఏపీ మండలి రద్దు తీర్మాన్ని ఆమోదించాల్సిందిగా కేంద్రమంత్రుల్ని కోరారు. వైసీపీ పార్లమెంట్ సభ్యుడిగా తాను ఈ లేఖను రాస్తున్నట్లు తెలిపారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com