ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. అమరావతే ఎజెండాగా ఉప ఎన్నిక పెడితే ముఖ్యమంత్రిని సైతం రెండు లక్షల మెజారిటీతో ఓడిస్తానన్నారు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా తనను తప్పించడంపై కొందరు వైసీపీ సోషల్ మీడియా భక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారని.. వారందరికీ ఇదే నా ఘాటైన సమాధానమంటూ వ్యాఖ్యానించారు రఘురామ. పార్లమెంటు కమిటీ ఛైర్మన్‌గా పూర్తికాలం బాధ్యతలు నిర్వహించానని, ఇప్పుడు ఆ పదవిని ముఖ్యమంత్రి తన సాటి మతస్తుడికి ఇచ్చుకున్నారని అన్నారు. మూడు నెలలు ఆగితే ఎవరి పదవి పోతుందో మీరే చూస్తారంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తన సొంత పరపతిపై సాధించిన పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇప్పుడు పార్టీ కోసం ఇచ్చేశానంటూ చెప్పుకొచ్చారు రఘురామ. తనపై అనర్హత వేటు తప్పదంటున్న మూర్ఖులు దమ్ముంటే అమరావతి అజెండాగా ఉప ఎన్నిక పెడతామని ముఖ్యమంత్రితో ప్రకటింపచేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com