రాయలసీమలో కూర్చొని ఖబడ్దార్ అంటే.. ఎవరూ భయపడరు : రఘురామకృష్ణంరాజు
కనకదుర్గమ్మ ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాలు చోరికి గురవటం దురదృష్టకరమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. హిందూ దేవాలయాల్లోనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సాయిబాబా గుడిలో విగ్రహం విరగ్గొట్టడం విచారకరమన్నారు. మంత్రి ఇంటి పక్కనే ఉన్న దేవాలయాల్లో ఇలా దొంగతనాలు జరగడం భాదాకరమన్నారు. దేవాలయాలపై దృష్టిపెట్టే మంత్రిని నియమిస్తూ బాగుంటుందని రఘురామ సూచించారు.
రాయలసీమలో కూర్చొని ఖబడ్దార్ అంటే.. ఎవరూ భయపడరని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాయలసీమ వారు నన్ను ఏమి చేయలేరు, నా దిష్టిబొమ్మలు తగలబెట్టడం తప్ప అని కౌంటర్ ఇచ్చారు. అమరావతి భూములపై వేసిన సిట్ విచారణపై స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. రాజధాని ప్రకటన తర్వాత రాజధాని ఇక్కడే ఉంటుందని భూములు కొన్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారని రఘురామ అన్నారు. గత ప్రభుత్వం చేసింది ఇన్ సైడర్ ట్రేడింగ్ అయితే మీరు చేస్తున్నది అవుట్ సైడ్ ట్రేడింగ్ అనాలా అంటూ ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బందులు గురిచేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ పై దాడి మంచిది కాదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com