వైఎస్సార్‌ బీమా పథకంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు

వైఎస్సార్‌ బీమా పథకంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు

ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్‌ బీమా పథకంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. గతంలో ఉన్న పథకానికే పేరు మార్చారంటూ ఎద్దేవా చేశారు.. ప్రతి పథకానికీ కేంద్రం ఇచ్చే వాటా ఈ పథకానికి లేదని ప్రకటనల్లో రాసుకున్న వైసీపీ ప్రభుత్వం.. గతంలో కేంద్రం వాటా ఇచ్చిన పథకాల్లో ప్రధాని పేరు, ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.. ముఖ్యమంత్రి రాజ్యాంగవిరుద్ధమైన పనులకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.. ఇలాంటి కార్యక్రమాల వల్ల సీఎంతోపాటు పార్టీ కూడా ఇబ్బందుల్లో పడక తప్పదన్నారు..

కేంద్ర విద్యా విధానానికి వ్యతిరేకంగా తెలుగు భాషను రాష్ట్ర ప్రభుత్వం ఖూనీ చేస్తోందని రఘురామకృష్ణరాజు రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో బోధన ప్రారంభిస్తారని సూటిగా ప్రశ్నించారు.. ఈ విషయంలో అధికారులకే క్లారిటీ లేదని విమర్శించారు రఘురామకృష్ణరాజు.

Tags

Read MoreRead Less
Next Story