వారి అవస్థలు వింటే బాధ కలిగింది : రఘురామ కృష్ణరాజు
X
By - Nagesh Swarna |1 Oct 2020 5:09 PM IST
నవ్యాంధ్ర ప్రదేశ్ ఇప్పుడు అప్పుల ఆంధ్ర అయ్యిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నెలల లోనే ఏడాదిలో ఉండే రుణ పరపతిలో 97% తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితికి నిదర్శనమన్నారు. ఏపీ తీసుకున్న స్థాయి అప్పులు ఏ రాష్ట్రము తీసుకోలేదని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలామంది తనతో మొరపెట్టుకున్నారని.. వారి అవస్థలు వింటే బాధ కలిగిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com