Rahul Jodo Yatra: ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ జోడో యాత్ర..
Rahul Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. ఈ రోజు నుంచి నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీ సరిహద్దు గ్రామమైన హాలహర్వి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది.
చత్రగుడి హనుమాన్ ఆలయం నుంచి రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆలూరు దగ్గరలో మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుంది. పాదయాత్రలో ఏపీ నాయకులతోపాటు.. తెలంగాణకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. భారీగా కార్యకర్తలు, కాంగ్రెస్ క్యాడర్ తరలి వచ్చారు. ఇళ్లపైకి ఎక్కి మరి రాహుల్‌ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 21 వరకు నాలుగు రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. తిరిగి ఈనెల 22న కర్ణాటకలోని రాయచూర్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.
అలాగే ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. అలాగే స్థానిక వేరు శెనగ రైతులతో రాహుల్ సమావేశం అవుతున్నారు.. రాహుల్‌ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు ఆలూరు క్యాంపు దగ్గర క్యూ కట్టారు యాత్రలో భాగంగా పంట పొలాల్లోకి దిగి రైతుల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు రాహుల్. పెద్దలకు పలకరింపులు,పిల్లలతో ముచ్చట్లతో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.
తిరిగి సాయంత్రం 4.30 గంటలకు లక్ష్మీనారాయణ సర్వీస్ స్టేషన్ నుంచి పాదయాత్ర మొదలై మానేకుర్తి వరకు సాగనుంది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. రాత్రి ఏడు గంటలకు యేగి గ్రామంలో 40వ రోజు పాదయాత్ర ముగియనుంది.భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఏపీసీపీ చీఫ్ సాకే శైలజానాధ్ తో పాటు కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలు,పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com