RAINS: ఉత్తరాంధ్రను వణికించిన భారీ వర్షాలు

RAINS: ఉత్తరాంధ్రను వణికించిన భారీ వర్షాలు
X
ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. విశాఖ తీరం వెంబడి అల్లకల్లోలం... ఈదురుగాలులతో కూడిన వర్షం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పారాదీప్-గోపాలపూర్ మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సంతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు నేలమట్టం అయి విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలి రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్ష బీభత్సానికి జన జీవనం అస్తవ్యస్తమైంది.

బం­గా­ళా­ఖా­తం­లో ఏర్ప­డిన వా­యు­గుం­డం ప్ర­భా­వం­తో ఉత్త­రాం­ధ్ర­లో పలు­చో­ట్ల వర్షా­లు కు­రు­స్తు­న్నా­యి. వి­శా­ఖ­ప­ట్నం­లో ఈదు­రు­గా­లు­లు బీ­భ­త్సం సృ­ష్టిం­చా­యి. పలు­చో­ట్ల చె­ట్లు వి­రి­గి­ప­డ్డా­యి. దీం­తో పాటు భారీ వర్షం కు­రి­సిం­ది. ఈదు­రు­గా­లుల ధా­టి­కి జీ­వీ­ఎం­సీ కా­ర్యా­ల­యం సమీ­పం­లో భారీ వృ­క్షం కూ­లిం­ది. పా­ర్కిం­గ్‌­లో ఉన్న లారీ, కా­రు­పై చె­ట్టు పడిం­ది. ఆకా­శ­వా­ణి కేం­ద్రం వద్ద మరో చె­ట్టు కూ­లిం­ది. అక్క­య్య­పా­లెం పరి­ధి శ్రీ­ని­వా­స­న­గ­ర్‌­లో కా­రు­పై రా­వి­చె­ట్టు కూ­ల­డం­తో ఓ ఇంటి గోడ పూ­ర్తి కూ­లి­పో­యిం­ది. 51వ వా­ర్డు కళింగ నగ­ర్‌ మె­యి­న్‌­రో­డ్డు­పై పా­ర్క్‌ చే­సిన కా­రు­పై చె­ట్టు కూ­లిం­ది.

పలు ప్రాం­తా­ల్లో వి­ద్యు­త్ స్తం­భా­లు, భారీ హో­ర్డిం­గ్స్‌ కు­ప్ప­కూ­లా­యి. ద్వా­ర­కా­న­గ­ర్ రో­డ్డు­లో­ని ఫా­ర్చు­న­ర్ కా­రు­పై చె­ట్టు కూ­లి­పో­యిం­ది. కారు పా­ర్క్ చేసి.. ఓనర్ షా­పిం­గ్‌­కు వె­ళ్ల­డం­తో ప్ర­మా­దం తప్పిం­ది. ఎక్క­డి­క­క్కడ భారీ ట్రా­ఫి­క్‌ జా­మ్‌ ఏర్ప­డిం­ది. ఏయూ, శం­క­ర­మ­ఠం, సత్యం జం­క్ష­న్‌, బీ­వీ­కే కా­లే­జీ రో­డ్ల­లో చె­ట్లు వి­రి­గి­ప­డ్డా­యి. వా­యు­గుం­డం ప్ర­భా­వం­తో శ్రీ­కా­కు­ళం, వి­జ­య­న­గ­రం,మన్యం,అల్లూ­రి, వి­శాఖ,అన­కా­ప­ల్లి జి­ల్లా­ల్లో అక్క­డ­క్కడ భారీ వర్షా­లు పడు­తు­న్నా­యి. కా­కి­నాడ,కో­న­సీమ, తూ­ర్పు­గో­దా­వ­రి,పశ్చి­మ­గో­దా­వ­రి, ఏలూ­రు జి­ల్లా­ల్లో అక్క­డ­క్కడ తే­లి­క­పా­టి-మో­స్త­రు వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉంది. శ్రీ­కా­కు­ళం, మన్యం, వి­జ­య­న­గ­రం, అల్లూ­రి, అన­కా­ప­ల్లి జి­ల్లా­ల్లో కొ­న్ని­ప్రాం­తా­ల్లో భారీ వర్షా­లు పడొ­చ్చ­ని… అక్క­డ­క్కడ అతి­భా­రీ వర్షా­లు పడు­తా­య­ని అం­చ­నా వే­సిం­ది. ఈ జి­ల్లా­ల­కు రెడ్ అల­ర్ట్ జారీ అయిం­ది. దక్షిణ కో­స్తా­లో మో­స్త­రు నుం­చి భారీ వర్షా­లు పడే సూ­చ­న­లు­న్నా­యి. తీర ప్రాం­తాల వెం­బ­డి ప్ర­యా­ణా­లు చే­య­వ­ద్ద­ని అధి­కా­రు­లు సూ­చిం­చా­రు. ఇం­ట్లో­నే సు­ర­క్షి­తం­గా ఉం­డా­ల­ని పే­ర్కొ­న్నా­రు. జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని… అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని స్ప­ష్టం చే­శా­రు.


Tags

Next Story