RAINS: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

RAINS: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
X
పలు జిల్లాల్లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

వా­యు­గుం­డం, ద్రో­ణి ప్ర­భా­వం­తో తె­లం­గాణ రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా అన్ని జి­ల్లా­ల­లో ఉరు­ము­లు, మె­రు­పు­ల­తో మో­స్తా­రు నుం­చి భారీ వర్షా­లు కు­రి­శా­యి. ని­ర్మ­ల్‌, ని­జా­మా­బా­ద్‌, మహ­బూ­బా­బా­ద్‌, వరం­గ­ల్‌, హను­మ­కొండ, జన­గాం, సి­ద్ది­పేట, యా­దా­ద్రి భు­వ­న­గి­రి, వి­కా­రా­బా­ద్‌, సం­గా­రె­డ్డి, సి­ద్ది­పేట, మె­ద­క్‌, కా­మా­రె­డ్డి, మహ­బూ­బ్‌­న­గ­ర్‌, నా­గ­ర్‌­క­ర్నూ­ల్‌, వన­ప­ర్తి, నా­రా­య­ణ­పేట, గద్వాల జి­ల్లా­ల్లో అక్క­డ­క్కడ భారీ వర్షా­లు కు­రి­శా­యి. వా­తా­వ­రణ శాఖ ఇప్ప­టి­కే ఎల్లో అల­ర్ట్ జారీ చే­సిం­ది. ఆది­లా­బా­ద్, కు­మ్రం భీం ఆసి­ఫా­బా­ద్‌, మం­చి­ర్యాల, జగి­త్యాల, రా­జ­న్న సి­రి­సి­ల్ల, కరీం­న­గ­ర్‌, పె­ద్ద­ప­ల్లి, జయ­శం­క­ర్‌ భూ­పా­ల­ప­ల్లి, ము­లు­గు, భద్రా­ద్రి కొ­త్త­గూ­డెం, ఖమ్మం, నల్ల­గొండ, సూ­ర్యా­పేట, రం­గా­రె­డ్డి, హై­ద­రా­బా­ద్, మే­డ్చ­ల్‌ జి­ల్లా­ల్లో­నూ వర్షం కు­రి­సిం­ది. సూ­ర్యా­పే­ట­తో­పా­టు పలు జి­ల్లా­ల­లో వర్షా­లు కు­రు­స్తు­న్నా­యి. అలా­గే ఉరు­ము­లు, మె­రు­పు­ల­తో గం­ట­కు 40 నుం­డి 50 కి­లో­మీ­ట­ర్ల మేర ఈదు­రు­గా­లు­లు వీచే అవ­కా­శం ఉం­ద­ని వా­తా­వ­రణ శాఖ హె­చ్చ­రిం­చిం­ది.

క్షేత్రస్థాయిలో రంగనాథ్‌

మూసీ నది ఉప్పొం­గి ప్ర­వ­హి­స్తోం­ది. దీం­తో హై­ద­రా­బా­ద్‌ నగ­రం­లో­ని మూసీ పరి­వా­హక ప్రాం­తా­ల­న్నీ జల­మ­య­మ­య్యా­యి. రె­వె­న్యూ, హై­డ్రా, ఎన్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్‌, ఎస్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్‌ రం­గం­లో­కి దిగి సహా­యక చర్య­లు చే­ప­డు­తు­న్నా­యి. హై­డ్రా కమి­ష­న­ర్‌ రం­గ­నా­థ్‌ మూసీ పరి­వా­హక ప్రాం­తా­ల్లో పర్య­టిం­చా­రు. ఎం­జీ­బీ­ఎ­స్‌­కు చే­రు­కొ­ని పరి­స్థి­తి­ని సమీ­క్షిం­చా­రు. ప్ర­యా­ణి­కు­లు ఇబ్బం­ది పడ­కుం­డా తీ­సు­కో­వా­ల్సిన చర్య­ల­పై అక్క­డి అధి­కా­రు­ల­కు పలు సూ­చ­న­లు చే­శా­రు. సి­బ్బం­ది అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు. వర్షాల వల్ల ప్ర­జ­లు, ప్ర­యా­ణి­కు­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని రం­గ­నా­థ్ సూ­చిం­చా­రు. హై­డ్రా సి­బ్బం­ది పూ­ర్తి అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు.

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు


తె­లం­గా­ణ­లో­ని జూ­రాల, సుం­కే­సుల ప్రా­జె­క్టుల నుం­చి భా­రీ­గా వర­ద­నీ­రు వి­డు­ద­ల­వు­తుం­డ­టం­తో శ్రీ­శై­లం ప్రా­జె­క్టు­కు వరద పో­టె­త్తిం­ది. కృ­ష్ణ­మ్మ పర­వ­ళ్లు తొ­క్కు­తుం­డ­టం­తో.. అధి­కా­రు­కు 10 గే­ట్ల­ను 12 అడు­గుల మేర ఎత్తి వరద నీ­టి­ని ది­గు­వ­కు వి­డు­దల చే­స్తు­న్నా­రు. ప్రా­జె­క్టు­కు ఇన్ ఫ్లో 4,04,658 క్యూ­సె­క్కు­లు ఉం­డ­గా.. ప్ర­స్తు­తం 3,81,392 క్యూ­సె­క్కుల నీ­టి­ని వి­డు­దల చే­స్తు­న్నా­రు. పో­తి­రె­డ్డి­పా­డు హెడ్ రె­గ్యు­లే­ట­రీ నుం­చి 5 వేల క్యూ­సె­క్కు­లు, ఎడ­మ­గ­ట్టు వి­ద్యు­త్ కేం­ద్రం నుం­చి 35,315 క్యూ­సె­క్కు­లు, కు­డి­గ­ట్టు వి­ద్యు­త్ కేం­ద్రం నుం­చి 30,237 క్యూ­సె­క్కుల నీ­టి­ని వి­డు­దల చే­స్తు­న్నా­రు.

Tags

Next Story