సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విగ్రహ ధ్వంసం కేసు.. పోలీసు కస్టడీకి అనుమానితులు

సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విగ్రహ ధ్వంసం కేసు.. పోలీసు కస్టడీకి అనుమానితులు
.పురోహితుడు సహా మిగిలిన ముగ్గురిపై కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందని పలువురు అభ్యంతరం తెలిపారు.

రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విగ్రహ ధ్వంసం కేసులో.. అనుమానితుల పోలీసు కస్టడీకి తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ముగ్గురు అనుమానితుల్ని కోర్టు అనుమతితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. ఒకరోజు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

రాజమండ్రిలోని లలితానగర్‌లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాలయం ఉంది. ఇందులోని స్వామి విగ్రహాన్ని జనవరి 1న గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో హిందూ సంఘాలు, భక్తుల నుండి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో... ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఘటనపై ఫిర్యాదు చేసిన ఆలయ పురోహితుడు మర్ల వెంకటమురళీకృష్ణతో పాటు మళ్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతిరాజు అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ.. డబ్బుల కోసమే విగ్రహాన్ని ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు.

అటు..పురోహితుడు సహా మిగిలిన ముగ్గురిపై కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందని పలువురు అభ్యంతరం తెలిపారు. కేసును లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితుల్ని మరింత లోతుగా విచారించాల్సి ఉందని న్యాయస్థానానికి తెలిపారు. నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు ఒకరోజు కస్టడీకి అప్పగిస్తూ నుమతించింది. ఆ ముగ్గురు అనుమానితుల్ని రాజమండ్రి త్రీటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story