RAJINI: విడదల రజని అనుచరులపై లంచం ఆరోపణలు

పల్నాడు జిల్లాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం బయటపడింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విడదల రజని పీఏలు, అనుచరులపై దోర్నాలకు చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి కృష్ణ , మరికొంతమంది బాధితులు పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని విడదల రజని పీఏలు శ్రీకాంత్ రెడ్డి, దొడ్డా రామకృష్ణ , ఆమె ముఖ్య అనుచరులు శ్రీగణేశ్, అతని సోదరుడు కుమారస్వామి మొత్తం రూ.5 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా దోర్నాల మండలానికి చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి కృష్ణ మరియు మరికొంతమంది యువకులు ఈ ఫిర్యాదు చేశారు. వారి ప్రకారం, విడదల రజని అనుచరులు 2023-2024 మధ్య కాలంలో "ఉద్యోగాలు ఇస్తామని" హామీ ఇచ్చి, వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు మొత్తం రూ.5 కోట్లు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని "ఉద్యోగాల సిఫార్సు ఫీజు"గా చెప్పుకుని సేకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో విడదల రజనీ మంత్రిగా ఉన్నారు. విడదల రజనీ పీఏలు శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ విడదల రజని పేరును ఉపయోగించుకుని మోసం చేశారని వారంటున్నారు. శ్రీగణేశ్ , కుమారస్వామి డబ్బు సేకరణలో కీలక పాత్ర పోషించారు.
వైఎస్సార్సీపీ ఓడిపోగానే మోసగాళ్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేశారంటూ బాధితులు ఆందోళన చెందారు. బత్తుల శ్రీగణేష్ తమ్ముడిని గట్టిగా అడిగితే మమ్మల్ని చంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై పల్నాడు జిల్లా ఎస్పీకి వినతిపత్రం ద్వారా ఫిర్యాదు చేసినట్లు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.బాధితులు మొత్తం సుమారు 10 నుంచి 15 మంది వరకూ ఉన్నారని ఫిర్యాదు చేసిన విద్యార్థులు వివరించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. తమకు తక్షణమే న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

