పెనమలూరులో ఎన్నారై హత్యకు కుట్ర

పెనమలూరులో ఎన్నారై హత్యకు కుట్ర

విజయవాడలో వైసీపీ నేతలు బరి తెగించారు.. పెనమలూరులో ఎన్నారై హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ముప్పవరపు చౌదరీ లీలా రామకృష్ణ ప్రసాద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కబ్జాకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు.. ట్రస్ట్‌కు సంబంధించిన ఐదెకరాల 80 సెంట్ల భూమిని కాజేందుకు ట్రై చేస్తున్నారు.. అయితే కబ్జాదారుల వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఎన్నారై శ్రీనివాసరావు ఆరోపించారు.. ట్రస్ట్‌ భూముల్లోకి రౌడీ మూకలను పంపి హల్‌చల్‌ చేస్తున్నారని.. భూముల్లోకి వెళ్తున్న ట్రస్ట్‌ మెంబర్లపై దాడులకు తెగబడుతున్నారని ఎన్నారై శ్రీనివాసరావు ఆరోపించారు.. కబ్జాదారుల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ బెజవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటాను కలిశారు ఎన్నారై శ్రీనివాసరావు.

వైసీపీ నేతల అండదండలతోనే తన భూమిని కాజేసే ప్రయత్నం జరుగుతోందని గతంలో పెనమలూరులో ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. ట్రస్ట్‌ను కాపాడుకునేందుకు పోరాడుతున్న తనను చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సీపీకి ఆయన కంప్లయింట్‌ చేశారు.. తనకు రక్షణ కల్పించాలని కోరగా పోలీస్‌ కమిషనర్‌ భరోసా ఇచ్చారని ఎన్నారై శ్రీనివాసరావు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story