RAMOJI AWARDS: ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

RAMOJI AWARDS: ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
X
ఘనంగా రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రదానోత్సవం.. పాల్గొన్న ఉప రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల సీఎంలు.. పాల్గొన్న తెలంగాణ గవర్నర్‌, కేంద్రమంత్రులు

రా­మో­జీ గ్రూ­ప్‌ సం­స్థల వ్య­వ­స్థా­ప­కు­లు ది­వం­గత రా­మో­జీ­రా­వు మహో­న్నత వ్య­క్తి, బహు­ముఖ ప్ర­జ్ఞా­శా­ల­ని పలు­వు­రు ప్ర­ము­ఖు­లు కీ­ర్తిం­చా­రు. హై­ద­రా­బా­ద్ రా­మో­జీ ఫి­ల్మ్ సి­టీ­లో 2025 రా­మో­జీ ఎక్స్‌­లె­న్స్‌ జా­తీయ అవా­ర్డుల ప్ర­దా­నో­త్సవ కా­ర్య­క్ర­మం­లో దే­శ­వ్యా­ప్తం­గా ఉన్న ప్ర­ము­ఖు­లు పా­ల్గొ­ని రా­మో­జీ రావు సమా­జా­ని­కి చే­సిన సే­వ­ని గు­ర్తు తె­చ్చు­కు­న్నా­రు. ఒక సా­ధా­రణ రైతు కు­టుం­బం­లో జన్మిం­చి రా­మో­జీ రావు చే­రు­కు­న్న శి­ఖ­రా­లు అని­తర సా­ధ్యా­ల­ని వా­రం­తా ము­క్త­కం­ఠం­తో అభి­వ­ర్ణిం­చా­రు. రా­మో­జీ రావు జయం­తి­ని పు­ర­స్క­రిం­చు­కు­ని ఏర్పా­టు చే­సిన కా­ర్య­క్ర­మం­లో దేశ ఉప­రా­ష్ట్ర­ప­తి, తె­లం­గాణ గవ­ర్న­ర్, తె­లు­గు­రా­ష్ట్రాల ము­ఖ్య­మం­త్రు­లు.. కేం­ద్ర మం­త్రు­లు కి­ష­న్‌­రె­డ్డి, రా­మ్మో­హ­న్‌­నా­యు­డు, బండి సం­జ­య్‌.. ఇలా పలు­వు­రు ప్ర­ము­ఖు­లు ఈ కా­ర్య­క్ర­మా­ని­కి హా­జ­రై రా­మో­జీ­రా­వు సా­ధిం­చిన వి­జ­యా­ల్ని గు­ర్తు చే­సు­కు­న్నా­రు.


దేశాభివృద్ధికి విశేష కృషి: ఎన్వీరమణ

పత్రిక ద్వా­రా దే­శా­భి­వృ­ద్ధి­కి రా­మో­జీ­రా­వు వి­శేష కృషి చే­శా­ర­ని సు­ప్రీం­కో­ర్టు మాజీ ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి జస్టి­స్‌ ఎన్‌.వి.రమణ అన్నా­రు. ఆయన ని­బ­ద్ధత కలి­గిన వ్య­క్తి అని, ఎప్పు­డూ అధి­కా­రా­న్ని కో­రు­కో­లే­ద­ని చె­ప్పా­రు. రా­మో­జీ గ్రూ­ప్‌ సం­స్థల వ్య­వ­స్థా­ప­కు­లు రా­మో­జీ­రా­వు పే­రిట ఏర్పా­టు చే­సిన రా­మో­జీ ఎక్స్‌­లె­న్స్‌ జా­తీయ అవా­ర్డుల ప్ర­దా­నో­త్సవ కా­ర్య­క్ర­మం ఘనం­గా జరి­గిం­ది. ఈ సం­ద­ర్భం­గా జస్టి­స్‌ రమణ మా­ట్లా­డు­తూ.. పత్రిక ద్వా­రా ప్ర­జ­ల్లో చై­త­న్యం తె­చ్చి ప్ర­జా­స్వా­మ్య పరి­ర­క్ష­ణ­కు రా­మో­జీ­రా­వు కృషి చే­శా­ర­ని కొ­ని­యా­డా­రు. రా­మో­జీ­రా­వు ని­బ­ద్ధత కలి­గిన వ్య­క్తి అని సు­ప్రీం­కో­ర్టు మాజీ ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి జస్టి­స్‌ ఎన్‌.వి.రమణ అన్నా­రురా­మో­జీ­రా­వు ఎప్పు­డూ తన పత్రి­క­ను స్వ­ప్ర­యో­జ­నాల కోసం వా­డు­కో­లే­దు. పత్రి­కా­రం­గం­లో ఒక దీ­ప­స్తం­భం­గా ని­లి­చా­రు. సారా వ్య­తి­రేక, సమా­చార హక్కు ఉద్య­మా­ల­ను ప్రో­త్స­హిం­చా­రు. ప్ర­జా­స్వా­మ్య పరి­ర­క్ష­ణ­లో కీలక పా­త్ర పో­షిం­చా­రు. రా­మో­జీ­రా­వు వా­ర­సు­లు వా­ర­స­త్వా­న్ని కొ­న­సా­గి­స్తు­న్నా­రు’’ అని అన్నా­రు. ఈ సం­ద­ర్భం­గా రా­మో­జీ ఫౌం­డే­ష­న్‌ రూ­పొం­దిం­చిన ని­ఘం­టు­వు­ల­ను జస్టి­స్‌ ఎన్‌.వి.రమణ, మాజీ ఉప­రా­ష్ట్ర­ప­తి వెం­క­య్య­నా­యు­డు ఆవి­ష్క­రిం­చా­రు.

పాత్రికేయ రాజర్షి రామోజీరావు: వెంకయ్య

పా­త్రి­కేయ రా­జ­ర్షి రా­మో­జీ­రా­వు అని మాజీ ఉప­రా­ష్ట్ర­ప­తి వెం­క­య్య­నా­యు­డు ప్ర­శం­సిం­చా­రు. అక్షర శక్తి­కి సరి­కొ­త్త ని­ర్వ­చ­న­మి­చ్చిన రా­మో­జీ­రా­వు స్వ­యం కృషి, క్ర­మ­శి­క్షణ, పట్టు­దల, చి­త్త­శు­ద్ధి, కా­ర్య­దీ­క్ష­త­లే ఆయు­ధా­లు­గా అనేక రం­గా­ల్లో వి­జ­యా­లు సా­ధిం­చి భవి­ష్య­త్‌ తరా­ల­కు మా­ర్గ­ద­ర్శ­నం చే­శా­ర­ని కీ­ర్తిం­చా­రు. తె­లు­గు ప్ర­జల గుం­డె­ల్లో రా­మో­జీ రావు స్థా­నం శా­శ్వ­త­మ­ని, రా­మో­జీ­రా­వు­లా ప్ర­జా జీ­వి­తం­పై ము­ద్ర­వే­సిన వ్య­క్తి ఇటీ­వ­లి కా­లం­లో మరొ­క­రు లే­ర­ని కొ­ని­యా­డా­రు.

ఆలోచన ప్రశంసనీయం: చంద్రబాబు

రా­మో­జీ గ్రూ­ప్‌ సం­స్థల వ్య­వ­స్థా­ప­కు­లు రా­మో­జీ­రా­వు పే­రిట ఏర్పా­టు చే­సిన రా­మో­జీ ఎక్స్‌­లె­న్స్‌ జా­తీయ అవా­ర్డుల ప్ర­దా­నో­త్స­వం కా­ర్య­క్ర­మం ప్ర­శం­స­నీ­య­మ­ని ఏపీ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు అన్నా­రు. జర్న­లి­జం, గ్రా­మీ­ణా­భి­వృ­ద్ధి, మానవ సేవ, సై­న్స్‌ అం­డ్‌ టె­క్నా­ల­జీ, కళ-సం­స్కృ­తి, మహి­ళా సా­ధి­కా­రత, యూ­త్‌ ఐకా­న్‌ వి­భా­గా­ల్లో అవా­ర్డు­లి­వ్వ­డం హర్ష­ణీ­య­మ­ని చం­ద్ర­బా­బు అభి­ప్రా­య­ప­డ్డా­రు. సమా­జ­సే­వ­లో ప్ర­జ­ల్ని భా­గ­స్వా­ము­ల­ను చే­సిన వ్య­క్తి రా­మో­జీ­రా­వు అని.. ఎలాం­టి వి­ప­త్తు వచ్చి­నా తన­దైన శై­లి­లో సే­వ­లు అం­దిం­చా­ర­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. రా­మో­జీ­రా­వు ఒక్క పి­లు­పు ఇస్తే ప్ర­జ­లు బాగా స్పం­దిం­చే­వా­ర­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­సు­కు­న్నా­రు. ఒక సీ­ఎం­గా తె­లు­గు భా­ష­ను కా­పా­డేం­దు­కు ఏమై­నా చే­స్తా­న­ని.. రా­మో­జీ రావు స్ఫూ­ర్తి­గా తె­లు­గు భాష సం­ర­క్షణ కోసం ప్ర­య­త్ని­స్తా­న­ని ఈ సం­ద­ర్భం­గా చం­ద్ర­బా­బు మాట ఇచ్చా­రు. రా­మో­జీ గ్రూ­ప్‌ సం­స్థ­లు తె­లం­గా­ణ­కు గర్వ­కా­ర­ణం­గా ని­లి­చా­య­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం, హై­ద­రా­బా­ద్‌ నగ­ర­మం­టే నా­లు­గు అద్భు­తా­లు గు­ర్తొ­స్తా­య­ని.. అం­దు­లో మొ­ద­టి­ది ఛా­ర్మి­నా­ర్‌, రెం­డో­ది గో­ల్కొండ, మూ­డో­ది హై­టె­క్‌ సిటీ, నా­లు­గు.. రా­మో­జీ ఫి­ల్మ్‌­సి­టీ అని సీఎం చె­ప్పా­రు.

Tags

Next Story