NTR District: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో అరుదైన వజ్రం

ఎన్టీఆర్ జిల్లా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరకడం హాట్ టాపిక్‌గా మారింది. వజ్రం దొరకడంతో విషయం ఆనోటా ఈనోటా పాకడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి వెళ్లి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఇది జరిగింది. అరుదైన వజ్రం దొరకడంతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.
సత్తెనపల్లి సమీపంలోని బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికింది. వజ్రానికి 6 కోణాలు ఉన్నాయి. ఇది షడ్భుజి వజ్రం కావడంతో మంచి డిమాండ్ వచ్చింది. దీని విలువ అరకోటి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు షడ్భుజి వజ్రం ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. వజ్రాల వ్యాపారులు ఆ కుటుంబాన్ని సంప్రదించి 40 లక్షలకు ఆ వజ్రాన్ని విక్రయించాలని బేరసారాలు జరిపినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. షడ్భుజి వజ్రానికి మరింత ధర వస్తుందని.. మంచి ఆఫర్ కోసం వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారట.
Tags
- diamond
- diamond hunting in river
- krishna river
- krishna river diamond
- #daimonds are founded in krishna river
- diamonds
- where is diamond found in india
- where are diamonds found in india
- diamond river
- where are diamonds found in the world
- diamond found in kurnool district
- where is diamonds found in india
- gemstones found in river
- #krishna river
- shri rama krishna diamond
- diamonds found in jonnagiri
- finding diamond that lost before in river real life
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com