AMBEDKAR: అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ హౌస్ లాన్స్‌లోని ప్రేరణ స్థల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... బాబాసాహెబ్ కు నివాళులు అర్పించారు.
అంబేద్కర్ సేవలను స్మరించుకుందాం: చంద్రబాబు
అంబేద్కర్ కలలుగన్న సమ సమాజాన్ని సాధించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యావంతులై, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ తెలిపారన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారన్నారు. ఆ మహానుభావుని సేవను స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు, భూ భారతి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటివి రాజ్యాంగ నిర్మాత బాటలో వేసిన కొన్ని అడుగులన్నారు.
అంబేద్కర్‌కు పవన్ కల్యాణ్, లోకేశ్ నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నివాళులు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లి, ప్రతీ వర్గానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని లోకేశ్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com