OKESH: రెడ్‌ బుక్‌పై లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు

OKESH: రెడ్‌ బుక్‌పై లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు
X
ఇప్పటికే రెడ్‌ బుక్‌ అమలు ఆరంభమైందన్న లోకేశ్... చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ బుక్ అమలు ఇప్పటికే ప్రారంభమైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రెడ్‌బుక్‌ అమలు చేస్తున్నామని, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని మరోసారి హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదనే మాటకు కట్టుబడి ఉన్నామని గుర్తుచేశారు. రైట్‌ ప్లేస్‌లో రైట్‌ పర్సన్‌ ఉండాలనేదే కూటమి ప్రభుత్వ అభిమతం అని లోకేశ్​ పేర్కొన్నారు.

లడ్డూ వివాదంపైనా..

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోన్న వేళ.. అక్కడికి వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని నారా లోకేశ్ సూచించారు. ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలని.. తాము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని లోకేశ్ అన్నారు. తాము జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదని.. సూపర్ సిక్స్ ఆల్రెడీ అమలు చేస్తున్నామని లోకేశ్ అన్నారు. వంద రోజుల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తామని తాను ఎక్కడా చెప్పలేదన్న ఆయన... మూసేసిన అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పాం ఇచ్చామని గుర్తు చేశారు. రూ.1000 పెన్షన్ 100 రోజుల్లో పెంచామన్నారు.

తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామని లోకేశ్ తెలిపారు. Yv సుబ్బారెడ్డి అన్ని ధరలు పెంచమని చెప్పి సామాన్యులకు దేవుడిని దూరం చేసే విధంగా ప్రవర్తించారని లోకేశ్ అన్నారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని.... విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ నాణ్యత బాగుందని వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా చెబుతున్నారు. దేవుని జోలికి వెళ్తే ఏం జరుగుతుందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు.' అని పేర్కొన్నారు.

'రెడ్ బుక్' పని ప్రారంభం

ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని లోకేశ్ అన్నారు. 'ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదలేది లేదు. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారన్నారు.

Tags

Next Story