30 Jan 2021 11:09 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ ఇంటర్ పరీక్ష...

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ఇంటర్ ఫస్ట్‌, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యుల్ రిలీజ్ అయింది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది.

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!
X

తెలంగాణ ఇంటర్ ఫస్ట్‌, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యుల్ రిలీజ్ అయింది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు 100 రూపాయల రుసుముతో చెల్లించాలని పేర్కొంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 2 వరకు 500 రూపాయల రుసుముతో, మార్చ్ 3 నుంచి మార్చి9 వరకు 1000 రూపాయల ఫైన్‌తో ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. కాగా మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Next Story