కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో.. కొబ్బరినూనె రాస్తే కరోనా తగ్గుతుందంటూ మత ప్రచారం

కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో.. కొబ్బరినూనె రాస్తే కరోనా తగ్గుతుందంటూ మత ప్రచారం
దేవుడి మీద విశ్వాసం ఉంచి కొబ్బరినూనె రాయించుకుంటే కరోనా తగ్గిపోతుందంటూ కొందరు మత ప్రచారం చేస్తున్నారు.

దేవుడి మీద విశ్వాసం ఉంచి కొబ్బరినూనె రాయించుకుంటే కరోనా తగ్గిపోతుందంటూ కొందరు మత ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే దర్జాగా తిరుగుతూ.. పేషెంట్లందరికీ కొబ్బరినూనె పూస్తోంది ఓ మత ప్రచారకురాలు. కరోనా ఉన్నవారితో పాటు సాధారణ రోగులకు కూడా కొబ్బరినూనె పూసేస్తోంది. సర్జికల్ వార్డు, జనరల్ వార్డుల్లోకి యథేచ్చగా తిరుగుతూ కనిపించిన వారికల్లా కొబ్బరినూనె రాసేస్తోంది. ఇదేంటని అడిగితే.. ఆస్పత్రి సిబ్బందే తనకు పర్మిషన్ ఇచ్చారని చెబుతోంది.

మరోవ్యక్తి సైతం బైబిల్ పట్టుకుని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో తిరుగుతున్నాడు. ఎవరని అడిగితే హాస్పిటల్ సూపరింటెండెంట్ అని ఎదురు సమాధానం చెబుతున్నాడు. కనీసం మాస్క్ పెట్టుకోకుండా.. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్వైర విహారం చేస్తున్నాడు. మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదు, చేతిలో బైబిల్‌ ఏంటని అడిగితే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంత బహిరంగంగా మత ప్రచారం చేస్తూ.. కరోనా రోగులతో పాటు సాధారణ పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటున్నా... ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story