REMAND: పిన్నెల్లి సోదరులకు రిమాండ్‌

REMAND: పిన్నెల్లి సోదరులకు రిమాండ్‌
X
14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం

పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి, ఆయన సో­ద­రు­డు వెం­క­ట­రా­మి­రె­డ్డి­కి మా­చ­ర్ల న్యా­య­స్థా­నం 14 రో­జుల రి­మాం­డ్ వి­ధిం­చిం­ది. దీం­తో వా­రి­ని నె­ల్లూ­రు జై­లు­కు తర­లిం­చా­రు. గుం­డ్ల­పా­డు టీ­డీ­పీ నేతల జంట హత్యల కే­సు­లో పి­న్నె­ల్లి సో­ద­రు­లు ఏ6, ఏ7గా ఉన్నా­రు. సు­ప్రీం­కో­ర్టు ఆదే­శా­ల­తో ఈరో­జు కో­ర్టు­లో లొం­గి­పో­యా­రు. మా­చ­ర్ల మాజీ ఎమ్మె­ల్యే పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి, ఆయన సో­ద­రు­డు వెం­క­ట్రా­మి­రె­డ్డి కో­ర్టు­లో లొం­గి­పో­యా­రు. గు­రు­వా­రం ఉదయం పల్నా­డు జి­ల్లా మా­చ­ర్ల­లో­ని సి­వి­ల్‌ జడ్జి కో­ర్టు­కు వా­రి­ద్ద­రూ వచ్చా­రు.

వై­సీ­పీ నేత, మా­చ­ర్ల మాజీ ఎమ్మె­ల్యే పి­న్నె­ల్లి రా­మ­కృ­ష్ణా­రె­డ్డి, ఆయన సో­ద­రు­డు వెం­క­ట్రా­మి­రె­డ్డి కో­ర్టు­లో లొం­గి­పో­యా­రు. గు­రు­వా­రం ఉదయం పల్నా­డు జి­ల్లా మా­చ­ర్ల­లో­ని జూ­ని­య­ర్‌ అద­న­పు సి­వి­ల్‌ జడ్జి కో­ర్టు­కు వా­రి­ద్ద­రూ వచ్చా­రు. ఎలాం­టి అవాం­ఛ­నీయ ఘట­న­లు జర­గ­కుం­డా పో­లీ­సు­లు బం­దో­స్తు ఏర్పా­టు చే­శా­రు. వె­ల్దు­ర్తి మం­డ­లం గుం­డ్ల­పా­డు­కు చెం­దిన టీ­డీ­పీ నా­య­కు­లు, సో­ద­రు­లైన జవ్వి­శె­ట్టి వెం­క­టే­శ్వ­ర్లు, కో­టే­శ్వ­ర­రా­వు­లు మే 24న హత్య­కు గు­ర­య్యా­రు. గ్రా­మం­లో ఆధి­ప­త్య పో­రు­ను తమకు అను­కూ­లం­గా మల­చు­కొ­ని జంట హత్య­ల­కు పరో­క్షం­గా సహ­క­రిం­చా­ర­ని పో­లీ­సు­లు పి­న్నె­ల్లి సో­ద­రు­ల­ను ఏ6, ఏ7గా చే­ర్చి కేసు నమో­దు చే­శా­రు. ఈ కే­సు­లో వారు దా­ఖ­లు చే­సు­కు­న్న ముం­ద­స్తు బె­యి­ల్‌ పి­టి­ష­న్‌­ను కిం­ది కో­ర్టు, హై­కో­ర్టు రద్దు చే­య­గా.. సు­ప్రీం­కో­ర్టు­లో సవా­ల్‌ చే­శా­రు. అక్కడ కూడా బె­యి­ల్‌ పి­టి­ష­న్‌ రద్ద­యిం­ది. సు­ప్రీం­కో­ర్టు ఆదేశాలతో పి­న్నె­ల్లి సో­ద­రు­లి­ద్ద­రూ కో­ర్టు­లో లొం­గి­పో­యా­రు.

మాచర్లలో ఉద్రిక్తత

పి­న్నె­ల్లి బ్ర­ద­ర్స్ లొం­గి­పో­తుం­డ­టం­తో పో­లీ­సు­లు అల­ర్ట్ అయ్యా­రు. జి­ల్లా వ్యా­ప్తం­గా వై­సీ­పీ నే­త­ల­ను హౌస్ అరె­స్టు­లు చే­స్తు­న్నా­రు. మా­చ­ర్ల­లో 144 సె­క్ష­న్, పో­లీ­స్ 30 యా­క్ట్ అమ­లు­లో ఉం­ద­ని తె­లి­పా­రు. కాగా, వై­సీ­పీ ఎమ్మె­ల్సీ లే­ళ్ల అప్పి­రె­డ్డి, వి­ను­కొండ మాజీ ఎమ్మె­ల్యే బొ­ల్లా బ్ర­హ్మ­నా­యు­డి­కు పో­లీ­సు­లు నో­టీ­సు­లు ఇచ్చా­రు. మాజీ ఎమ్మె­ల్యే శి­వ­కు­మా­ర్ కా­రు­లో మా­చ­ర్ల­కు బయ­లు­దే­రా­రు.వి­డ­దల రజి­ని ఇంటి దగ్గర పో­లీ­సు­లు మో­హ­రిం­చా­రు.

Tags

Next Story