AP: ఏపీలో భారీగా ఓట్ల తొలగింపు

AP: ఏపీలో భారీగా ఓట్ల తొలగింపు
X
ప్రతిపక్షాల ఓట్లు అడ్డగోలుగా తొలగింపు; జగన్‌ సర్కార్‌ ఆదేశాలతోనే అరాచకమంటూ ఆరోపణలు

ఏపీలో భారీగా ఓట్ల తొలగిస్తున్నారు.ప్రతిపక్షాల ఓట్లు అడ్డగోలుగా తీసేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్‌ సర్కార్‌ ఆదేశాలతోనే ఈ పక్రియ సాగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే ఓట్ల తొలగింపుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యద్ధం ప్రకటించింది.కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసే ఆలోనలో టీడీపీ అధినేత ఉన్నారు.అధికార పార్టీ అక్రమాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు శత జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో ఆయన స్మృత్యర్థం ప్రత్యేక నాణేలను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న చంద్రబాబు ఉన్నారు. అదే రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసే అవకాశం ఉంది. అపాయింట్మెంట్‌ కోరుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపింది. ఈ మేరకు ఈసీకి మూడు అంశాలపై ఫిర్యాదు చేయనుంది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఇష్టానుసారం తొలగిస్తున్నారని నగరాలు, పట్టణాల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను చెల్లాచెదురు చేస్తున్నారని ఫిర్యాదు చేయనుంది. , ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే పోలింగ్‌ బూత్‌ పరిధిలో కాకుండా అనేక చోట్లకు మారుస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను నకిలీ డోర్‌ నంబర్లు, నకిలీ చిరునామాలతో ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారని, కింది స్థాయి అధికారులు దీనిని అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదన్నది మూడో ఫిర్యాదు. వీటికి సంబంధించిన పలు ఆధారాలను కూడా చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు.

ఇక రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో,ఏ పల్లెలో చూసినా ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు రోజుకొకటి వెలుగుచూస్తూనే ఉన్నాయి. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు ఓట్లే లేకుండా చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒకరికి ఓటు ఉంచి మిగతా వారివి తీసేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్లూ ఇప్పుడు జాబితాలో తొలగించారు. ఒకే కుటుంబంలో ఒకరి ఓటు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉంచి మరొకరిది వేరే కేంద్రం పరిధిలో చేర్చేశారు.జీరో డోర్‌ నంబర్‌తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు పెట్టారు. ఒకే ఇంట్లో, ఒకే డోర్‌ నంబర్‌ చిరునామాతో వందల ఓట్లు చేర్చారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించేశారు. అధికార పార్టీకి అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్చారు. ఇలా ఒకటో, రెండో కాదు.. చెబుతూ పోతే ఎన్నెన్నో అక్రమాలు, అవకతవకలపై ప్రతిపక్ష పార్టీలు ఆధారాలు సహా ఎన్నికల సంఘానికి పదే పదే ఫిర్యాదులు చేస్తున్నాయి.

మరోవైపు అన్ని ఆధారాలు ఉన్నా రాష్ట్ర ఎన్నికల సంఘం చూసీ చూడనల్లు వ్యవహరీస్తోందని,అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగావ్యవహరించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి.? అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమాలపై ఆ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.. డిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదులు చేసి.. దాదాపు ఏడాది పాటు పోరాడితే ఇప్పటికి బాధ్యులపై చర్యలు చర్యలు తీసుకున్నారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags

Next Story