MARGADARSHI: మార్గదర్శిపై ఆరోపణలు పచ్చి అబద్దాలు

MARGADARSHI: మార్గదర్శిపై ఆరోపణలు పచ్చి అబద్దాలు
స్పష్టం చేసిన మార్గదర్శి సంస్థ యాజమాన్యం... బురద చల్లేందుకు జగన్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపణ..

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Margadarsi Chit Fund Pvt Ltd)పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh GOVT) చేసిన ఆరోపణలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఆరు దశాబ్దాలు(sixty years has serviced)గా చందాదారుల అచంచల విశ్వాసంతో పూర్తి పారదర్శకంగా వ్యాపారం చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌(Margadarsi)పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు, సంస్థ మీద బురద చల్లేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించింది. చందాదారులను బెదిరించేందుకు జగన్‌ సర్కారు పన్నాగం పన్నుతోందని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే లక్ష్యంగా కుట్రపూరిత, దురుద్దేశపూరిత చర్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందని వెల్లడించింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి పత్రికా ప్రకటనలు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది.


అత్యంత విశ్వసనీయత కలిగిన మార్గదర్శిపై పదే పదే నిరాధార, ఊహాజనిత, అవాస్తవ ఆరోపణలు చేస్తూ చందాదారుల్లో ఉన్న అచంచల విశ్వాసాన్ని నాశనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్నాళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలేవీ చందాదారుల్లో మార్గదర్శిపై ఉన్న నమ్మకాన్ని ఇసుమంతైనా సడలించలేకపోయాయని గుర్తు చేసింది. మార్గదర్శి చందాదారుల్లో భయాందోళనలు, అభద్రతాభావం సృష్టించాలని రోజుకో కుట్రను అమలు చేస్తోందని ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. అందులో భాగంగానే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మరీ.. మార్గదర్శిపై అభూత కల్పనలు, అసత్య ఆరోపణలతో వివిధ పత్రికల్లో ఆదివారం పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఖండించింది.


మార్గదర్శిపై ఎలాంటి తీవ్రమైన చర్యలూ తీసుకోవద్దంటూ హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపారం నడవనీయకుండా ఎలాగైనా అడ్డుకోవటం, ఆర్థికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది.

ఏపీ సీఐడీ దురుద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణల్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ తెలిపింది. ఎక్కడా ఒక్క ఎగవేతకు, అక్రమానికి తావీయకుండా దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న వ్యాపారాన్ని కూల్చే ఎత్తుగడలో భాగంగా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం, చందాదారుల్ని భయభ్రాంతులకు గురిచేయడం ఈ అవాస్తవాల వెనక అసలు లక్ష్యమని తెలిపింది. మార్గదర్శిని వాస్తవాలతో ఎదుర్కోలేక ఏపీ ప్రభుత్వం సీఐడీ విభాగం ద్వారా మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ప్రజల్ని, ముఖ్యంగా చందాదారుల్ని అయోమయానికి గురిచేస్తోందని పేర్కొంది. ఎలాగైనా మార్గదర్శిపై కక్షసాధించాలన్న తొందరలో జగన్‌ ప్రభుత్వం సంస్థ చరాస్తుల్ని జప్తు చేస్తున్నట్టు ప్రకటించిందని.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, తదితర పెట్టుబడుల రూపంలో ఉన్న ఈ చరాస్తులు కంపెనీ ఆరుదశాబ్దాలుగా గడించిన లాభాలతో సమకూర్చుకున్నవే తప్ప ఒక్క పైసా కూడా చందాదారుల చందా నుంచి తీసుకున్నది కాదని స్పష్టం చేసింది.


సీఐడీ దర్యాప్తునకు సహేతుకమైన ప్రాతిపదికే లేదని మార్గదర్శి సంస్థ పేర్కొంది. చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తూ మిసిలేనియస్‌ నాన్‌బ్యాంకింగ్‌ కంపెనీ కోవకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం వర్తించదని.. మార్గదర్శి 1982 నాటి చిట్‌ఫండ్‌ చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపింది.


మార్గదర్శి యాజమాన్యంపై తప్పుడు కేసులు బనాయించి 60 ఏళ్లుగా మార్గదర్శిపై...... అచంచల విశ్వాసముంచిన చందాదారుల దృష్టిలో సంస్థను దోషిగా నిలిపే కుతంత్రంలో భాగంగా వాస్తవాల్ని కావాలనే మరుగుపరుస్తోందని మార్గదర్శి సంస్థ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story