TS: టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ కసరత్తు

TSPSC ప్రక్షాళనపై దృష్టి పెట్టిన సర్కార్ ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి UPSC ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు గానూ... పలు అంశాలపై మనోజ్ సోనితో చర్చించినట్టు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నట్లు సమాచారం. TSPSC సమూల ప్రక్షాళన తర్వాతే ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టంచేసింది.
వివాదరహితంగా పరీక్షలు నిర్వహించేందుకు U.P.S.Cతో పాటు కేరళలాంటి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే TSPSC అధికారులు కేరళలో పర్యటించి.... ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే UPSC ఛైర్మన్ మనోజ్ సోనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. USPC మాదిరిగా TSPSC రూపొందించాల ని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ మ నోజ్ సోనికి తెలిపారు. TSPSC ప్రక్షాళన, యూపీఎస్సీ ప ని తీరుపై సుమారు గంటన్నర పాటు చర్చించారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని... ఇంతవరకు అవినీతి మ ర క అంట లేద ని రేవంత్ అన్నారు. ఇందుకు ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారని ఆరా తీశారు. యూపీఎస్సీ ఛైర్మన్ , సభ్యుల నియామ కంలో రాజ కీయ ప్రమేయం ఉండదని.. స మ ర్థత ఆధారంగా ఎంపిక చేస్తామని మనోజ్ సోని చెప్పారు. TSPSC ఛైర్మన్ తోపాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు తెలంగాణకు రావాల్సిన బకాయిలను వేగంగా విడుదల చేయాలని.. కేంద్రమంత్రులకుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తొలుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన CM 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన 2 వేల 233 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కింద విడుదల చేయాల్సిన 18 వందల కోట్లను విడుదల చేయాలని సీతారామన్ ను కోరారు. తర్వాత రక్షణమంత్రి రాజ్ నాథ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి హైదరాబాద్ లో రహ దారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని కూడా రాజ్ నాథ్ ను కోరారు. ఈ విజ్ఞప్తులకు రక్షణమంత్రి సానుకూలంగా స్పందించారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com