నారా భువనేశ్వరికి ఫోన్ చేసి పలకరించిన రేవంత్ రెడ్డి భార్య..

నారా భువనేశ్వరికి ఫోన్ చేసి పలకరించిన రేవంత్ రెడ్డి భార్య..
X
రేవంత్ రెడ్డి భార్య గీత తన హుందాతనాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత గీత నారా భువనేశ్వరికి ఫోన్ చేసి తన మద్దతును ప్రకటించారు.

రేవంత్ రెడ్డి భార్య గీత తన హుందాతనాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత గీత నారా భువనేశ్వరికి ఫోన్ చేసి తన మద్దతును ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఆమెకు తోడుగా ఉంటానన్నారు. తన మాటల ద్వారా ఆమెకు బలం చేకూర్చారు. తన భర్త అరెస్టుపై భువనేశ్వరి మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. న్యాయం జరగాలని ఆకాంక్షించారు.

రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గరి అనుబంధం ఉంది. రాష్ట్రాలు విడిపోయినా, ఆ తర్వాత రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారినప్పటికీ, వీరిద్దరి బంధం ఏ మాత్రం తగ్గలేదు. రేవంత్ దంపతులు మద్దతు తెలపడం నాయుడు కుటుంబంతో ఉన్న బంధానికి నిదర్శనం.

రేవంత్ భార్య గీత కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత జైపాల్ రెడ్డికి మేనకోడలు. గీత రాజకీయాల్లో లేదు. అయితే చంద్ర బాబు నాయుడు భార్య భువనేశ్వరితో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే చంద్ర బాబు అరెస్టుతో కృంగిపోయిన భువనేశ్వరని ఓదార్చే ప్రయత్నంలో ఆమెకు ఫోన్ చేసి మద్దతు తెలిపింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గీత చర్యపై పలువురు తెలంగాణ నేతలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఆకస్మిక అరెస్టు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. నాయుడు కుటుంబం అతడి అరెస్టును జీర్ణించుకోలేకపోతోంది. ఆదివారం వారి పెళ్లి రోజు కావడంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు.

Tags

Next Story