revanth: మోదీని ఓడించి తీరుతాం: రేవంత్‌రెడ్డి

revanth: మోదీని ఓడించి తీరుతాం: రేవంత్‌రెడ్డి
X
మోదీతో రాజ్యాంగానికి ప్రమాదం... కాంగ్రెస్ న్యాయసదస్సులో సీఎం ఫైర్... హస్తం పార్టీది ఎప్పుడూ ప్రజా పక్షమే

స్వా­తం­త్య్ర సాధన కో­స­మే కాం­గ్రె­స్ పా­ర్టీ ఏర్పా­టైం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి తె­లి­పా­రు. ఆం­గ్లే­యు­ల­ను దేశం నుం­చి పా­ర­ద్రో­లి దే­శా­ని­కి స్వా­తం­త్య్రం ఇచ్చిం­ది కాం­గ్రె­స్ పా­ర్టీ అని ప్ర­శం­సిం­చా­రు. ఢి­ల్లీ­లో­జ­రు­గు­తు­న్న కాం­గ్రె­స్ వా­ర్షిక న్యాయ సద­స్సు­లో ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ప్ర­సం­గిం­చా­రు. రెం­డు చెంప దె­బ్బ­లు కొ­ట్ట­యి­నా వక్ర మా­ర్గం­లో ఉన్న నే­త­ల­ను దా­రి­లో­కి తె­చ్చేం­దు­కు కాం­గ్రె­స్ కృషి చే­స్తోం­ద­ని పే­ర్కొ­న్నా­రు. బి­జె­పి, బి­ఆ­ర్‌­ఎ­స్, జెడి, బి­జె­పి, ఆర్‌­జె­డి, టి­ఎం­సి, డి­ఎం­కె, అన్నా­డి­ఎం­కె­తో ఏ పా­ర్టీ అయి­నా స్వా­త్రం­త్యం తరు­వా­తే వచ్చా­య­ని తె­లి­య­జే­శా­రు. దే­శం­లో సా­మా­జిక న్యా­యం, దళి­తు­లు, ఆది­వా­సీల సం­క్షే­మం కోసం కృషి చే­సిం­ది కాం­గ్రె­స్ పా­ర్టీ అని, ఇతర పా­ర్టీ­లు ఎన్ని­క­ల్లో గె­లి­స్తే కూ­ర్చీ­లో… ఓడి­తే ఇం­ట్లో కూ­ర్చుం­టా­య­ని, ఎన్ని­క­ల్లో ఓడి­నా, గె­లి­చి­నా ప్ర­జల మధ్యే ఉన్న పా­ర్టీ కాం­గ్రె­స్ అని రే­వం­త్ రె­డ్డి కొ­ని­యా­డా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ ఏం చే­సిం­ద­ని బీ­జే­పీ ప్ర­శ్ని­స్తోం­ద­ని 140 ఏళ్ల కిం­ద­టే ఈ దే­శా­ని­కి స్వా­తం­త్య్రం తీ­సు­కు­వ­చ్చేం­దు­కు కదం­తొ­క్కిం­దే కాం­గ్రె­స్ పా­ర్టీ అని బ్రి­టీ­ష్ పా­ల­కు­ల­ను తరి­మి­కొ­ట్టిం­ది కాం­గ్రె­స్సే రే­వం­త్ అన్నా­రు. ప్ర­ధా­ని నరేం­ద్ర మోడీ నే­తృ­త్వం­లో రా­జ్యాం­గం ప్ర­మా­దం­లో ఉం­ద­ని, 11 ఏళ్లు­గా సా­మా­జిక న్యా­యం కోసం ఆలో­చిం­చ­డం­లే­ద­ని, దే­శా­ని­కి మా­ర్గ­ద­ర్శ­నం కోసం మను­సిం­ఘ్వీ నే­తృ­త్వం­లో సద­స్సు ని­ర్వ­హిం­చ­డం గొ­ప్ప­వి­ష­య­మ­న్నా­రు.

మోదీని ఓడిస్తాం

బీ­జే­పీ, మో­డీ­ల­ను ఓడిం­చ­డా­ని­కి మేం తక్కువ కాదు.. రా­ను­న్న ఎన్ని­క­ల్లో మోడీ, బీ­జే­పీ­ని ఓడి­స్తా­మ­ని రే­వం­త్ రె­డ్డి తె­లి­పా­రు. సో­ని­యా­ను ప్ర­ధా­ని చే­యా­ల­ని అం­ద­రూ కో­రి­నా.. మన్మో­హ­న్ సిం­గ్ కు అవ­కా­శం ఇచ్చా­రు.. రా­ష్ట్ర­ప­తి అవ­కా­శం వచ్చి­నా ప్ర­ణ­బ్ ము­ఖ­ర్జీ­కి ఛా­న్స్ ఇచ్చా­రు.. త్యా­గా­ల­కు మారు పేరు గాం­ధీ కు­టుం­బం.. ప్ర­ధా­ని, కేం­ద్ర మం­త్రి పద­వు­లు రా­హు­ల్ గాం­ధీ తీ­సు­కో­లే­దు.. దే­శం­లో ప్ర­జల కోసం, సా­మా­జిక న్యా­యం కోసం ఆయన పో­రా­డు­తు­న్నా­రు.. 2001 నుం­చి మోడీ కు­ర్చీ వద­ల­డం లేదు.. 75 ఏళ్లు నిం­డిన వా­ళ్ళు కు­ర్చీ వీ­డా­ల­ని మో­హ­న్ భగ­వ­త్ అన్నా­రు.. కానీ, మోడీ మా­త్రం వద­ల­డం లే­ద­ని సె­టై­ర్లు వే­శా­రు. ఆర్ఎ­స్ఎ­స్ మో­డీ­ని తప్పిం­చక పోతే.. రా­ను­న్న ఎన్ని­క­ల్లో మో­డీ­ని రా­హు­ల్ ప్ర­ధా­ని కు­ర్చీ నుం­చి తప్పి­స్తా­ర­ని పే­ర్కొ­న్నా­రు. వచ్చే ఎన్ని­క­ల్లో బీ­జే­పీ­కి 150 స్థా­నా­ల­కు మిం­చి రా­వ­ని వి­మ­ర్శిం­చా­రు. ఇక, తె­లం­గా­ణ­లో కు­ల­గ­ణన చేసి.. దే­శా­ని­కి రోల్ మో­డ­ల్ గా ని­లి­చా­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి చె­ప్పా­రు. వచ్చే ఎన్ని­క­ల్లో రా­హు­ల్ గాం­ధీ మో­డీ­తో తల­ప­డి బీ­జే­పీ­కి 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రా­కుం­డా అడ్డు­కు­నేం­దు­కు కాం­గ్రె­స్ కు­టుం­బం సి­ద్ధం­గా ఉం­ద­న్నా­రు

Tags

Next Story