Tirupati : తిరుపతి వివాహిత హత్య కేసులో భర్తే యముడు

Tirupati : తిరుపతికి చెందిన ఓ వివాహిత హత్య కేసులో ఐదు నెలల తర్వాత మిస్టరీ వీడింది. భర్తే యముడని తేల్చేశారు పోలీసులు. విడాకులు ఇవ్వనందుకే భార్యను హత్య చేసినట్లు వేణుగోపాల్ అంగీకరించాడు. కాపురానికి రాను అందని.. విడాకులు ఇవ్వకుండా టార్చర్ పెట్టిందని ఆరోపించాడు. అందుకే చంపేశానన్నాడు. సాఫ్ట్‌వేర్ ఐన వేణుగోపాల్‌కు, పద్మలకు కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది.
ఐతే పెళ్లయినప్పటి నుంచే తరచూ గొడవలు జరిగేవి. విషయం పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల వరకు వెళ్లింది. ఐనా రాజీ కుదరకపోవడంతో.. వేణుగోపాల్ భార్యపై కక్ష పెంచుకున్నాడు. జనవరి 5న భార్యను పుట్టింటినుంచి తీసుకొచ్చి తలపై కర్రతో మోది హత్య చేశాడు. డెడ్‌బాడీని దుప్పట్లో చుట్టి వెంకటాపురం చెరువులో పడేశాడు. నెలలు గడుస్తున్నా కూతురి జాడ తెలియకపోవడంతో తీవ్ర క్షోభకు గురైన పద్మ తల్లి... వేణుగోపాల్‌ను అర్థించింది.
కూతురి జాడ చెప్పమని ఎంత వేడుకున్నా స్పందించకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ దైన స్టయిల్‌లో విచారించారు. దీంతో భార్యను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇక వేణుగోపాల్‌ను వెంకటాపురం చెరువుకు తీసుకెళ్లిన పోలీసులు... పద్మ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com