ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటోను.. ఆర్టీసీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. మరణించిన వారందరూ వ్యవసాయ కూలీలని పోలీసులు తెలిపారు. మృతులను అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.
చంద్రబాబు దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు కూలీలు మృతి చెందడం పై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com