AP: ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు విద్యార్థుల మృతి

AP: ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు విద్యార్థుల మృతి
X
అయిదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతి... ఒంగోలులో కాలేజీలో చదువుతున్న విద్యార్థులు


తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నితీశ్‌ వర్మ, చేతన్‌రామ్‌, యుకేష్‌, నితీశ్‌, చైతన్య విష్ణుగా గుర్తించారు. వీళ్లంతా ఒంగోలులో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. తిరువళ్లూరు వెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందులో ఐదుగురిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకొంది. మృతులందరూ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందినవారిగా తెలిసింది.

ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీష్‌(21), తిరుపతికి చెందిన యుగేశ్‌(23), చేతన్‌(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్‌(21), విజయవాడకు చెందిన బన్ను నితీష్‌(22), నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వారందరూ శనివారం కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న గిద్దలూరు నితీష్, చేతన్, రామ్మోహన్, యుగేష్, బన్ను నితీష్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విష్ణు, చైతన్యకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు.

వాగులో కొట్టుకుపోయిన కారు: ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

ఓ వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అందులోని ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పంజాబ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మెహత్పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్‌లోని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జైజోన్ ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తోపాటు మొత్తం 10 మంది కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొది. ఒకరిని కాపాడిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు మృతదేహాను గుర్తించామని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ జాగిర్ సింగ్ తెలిపారు.

Tags

Next Story