ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప - చిత్తూరు హైవేలో కలకడ వద్ద ఓ ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోవడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది సహా మృతుల పూర్తి వివరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని పోలీసులు అంటున్నారు. ఒక్కరి నిర్లక్ష్యంతో ఒక్కో ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరుగుతోందని, కనుక జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.

Tags

Next Story