21 March 2021 8:15 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / విశాఖ పొలమాంబ ఆలయంలో...

విశాఖ పొలమాంబ ఆలయంలో భారీ చోరీ

సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ లు కూడా మాయం కావడంతో అధికారులు అవాక్కయ్యారు.

విశాఖ పొలమాంబ ఆలయంలో భారీ చోరీ
X

విశాఖ జిల్లా పెద్ద వాల్తేర్ పొలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి బంగారు ఆభరణాలు, వెండి కిరీటంతో పాటు వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ లు కూడా మాయం కావడంతో అధికారులు అవాక్కయ్యారు. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది తాళాల కోసం కార్యాలయానికి వెళ్లడంతో చోరీ అయిందని గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని.. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు. మరోవైపు ఆలయంలో చోరీపై అనుమానం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు.. అధికారుల నిర్లక్ష్యం వల్లే చోరీ జరిగిందని మండిపడుతున్నారు.


Next Story