ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ.. ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్న దొంగలు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికూడిలోని ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులు... అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా దొంగలు చాలా పకడ్బందీగా వ్యవహరించారని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అర్థరాత్రి బ్యాంకులో చొరబడ్డ దుండగులు..85 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు. దొంగలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. గ్యాస్ కట్టర్లతో గేట్‌ను కట్ చేసినట్టు వివరించారు.
శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడగా.. ఉదయం నగదు మాయం కావడాన్ని బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
Next Story