చిత్తూరు జిల్లాలో పంట భూములను సైతం వదిలిపెట్టని అధికారపార్టీ నేతలు

చిత్తూరు జిల్లాలో పంట భూములను సైతం వదిలిపెట్టని అధికారపార్టీ నేతలు
చిత్తూరు జిల్లాలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది.. రైతులు పండించుకునే భూములను సైతం అధికారపార్టీ నేతలు వదిలి పెట్టడంలేదు. అధికార దర్పంతో రైతుల భూములను..

చిత్తూరు జిల్లాలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది.. రైతులు పండించుకునే భూములను సైతం అధికారపార్టీ నేతలు వదిలి పెట్టడంలేదు. అధికార దర్పంతో రైతుల భూములను లాగేసుకున్నారు. ఎన్నో యేళ్ళుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ జీవితాలను వైసిపి నాయకులు సర్వనాశనం చేస్తున్నారంటూ రైతులు లబోదిబోమంటున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాలలో నివాసముంటున్న 50కిపైగా వ్యవసాయ కుటుంబాలు ఎన్నో యేళ్లుగా ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను నమ్ముకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.. అగరాలలో ఉన్న గ్రామస్తులకు వ్యవసాయమే జీవనాధారం. అయితే ..అలాంటి భూములపై ప్రస్తుత అధికార పార్టీ నేతల కన్నుపడింది.

ప్రభుత్వం అప్పట్లో ఈ రైతులకు పట్టాలు ఇవ్వలేదు. టిడిపి హయాంలో ప్రభుత్వం పట్టాలిచ్చేందుకు సిద్థమైంది. అయితే.. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికంగా ఉన్న నేతలందరినీ కలిశారు రైతులు. అయితే ..భూములు తమకు ఇవ్వకపోగా ఆ భూములనే స్వాహా చేసేందుకు కొంతమంది వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వం రైతుల కోసం అప్పట్లో ఇచ్చిన 59ఎకరాల్లో 30ఎకరాలు తమవేనంటూ అధికార పార్టీ నేతలు ఒక ఎన్ఓసిని తెచ్చేసుకున్నారు. దీంతో.. బాధిత రైతులు చంద్రగిరి ఎమ్మార్వోను కలిశారు. అయితే.. ఆ భూములు మీవి కావంటూ ఎమ్మార్వో చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమ పొలాలను తమకే ఇవ్వాలని..పట్టాలిచ్చి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story