SAD: విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

విశాఖలో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. యారాడ బీచ్ లో స్నానానికి దిగి అలలు ధాటికి కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి 16 మంది పర్యాటకులు విశాఖకి వచ్చారు. అలలు తాకిడికి కొట్టుకుపోయి ఓ విదేశీయుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సరదాగా గడిపేందుకు వచ్చిన విదేశీయులు బీచ్‌కి వచ్చారు. తీరంలో ఆడుకుంటూ, తరువాత లోపలికి వెళ్లగా అలలు లోనికి లాక్కుపోయాయి. కేకలు విన్న స్థానికులు లైఫ్ గార్డ్స్ కు సమాచారం అందించారు. కొట్టుకుపోతున్న ఇద్దరిని రక్షించే ప్రయత్నం గార్డ్స్ ప్రయత్నించారు. కానీఫలితం లేకుండా పోయింది.
సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరిని రక్షించి ఒడ్డుకి తెచ్చినప్పటికీ వాళ్లలో ఒకరు అప్పటికే చనిపోయాడు. మరో విదేశీయుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మృతుడి వివరాలు వెల్లడించేందుకు విదేశీయులు నిరాకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీ వర్షాలకు సిక్కోలు అతలాకుతలం
తీవ్ర వాయుగుండం సిక్కోలును నిండా ముంచింది. భారీ వర్షాలు, వంశధార, నాగవళి నదలు వరద జనం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వంశధార, నాగవళి శాంతించడంతో ముంపు గ్రామాలు తేరుకుంటున్నాయి. రోడ్లు ధ్వంసమైన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. పాతపట్నం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపార్లాయి. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవాహించాయి. దీంతో సమీప ప్రాంత పంటపొలాల్లోకి నడుములోతు నీళ్లు చేరాయి. హిరమండలంలో నాలుగు అడుగులకు పైగా పెరిగిన వరి చేలల్లో కూడా వరద నీరు ముంచెత్తింది. మూడు రోజులు అవుతున్నా పొలాల్లో తగ్గకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ తమను ఎవరూ పరామర్శించలేదని వాపోయారు. కష్టంలో ఉన్న తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 వేల ఎకరాల్లో పంట జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com