జగన్‌ నచ్చచెప్పినా వినకుండా షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు: సజ్జల

జగన్‌ నచ్చచెప్పినా వినకుండా షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు: సజ్జల
షర్మిల రెండు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నారని వద్దని జగన్‌ నచ్చచెప్పినా.. ఆమె పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల రెండు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నారని వద్దని జగన్‌ నచ్చచెప్పినా.. ఆమె పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు నిర్ణయం షర్మిల వ్యక్తిగతమని స్పష్టం చేశారు.

తెలంగాణలో పార్టీ వద్దని జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని తెలిపారు. షర్మిల సొంతంగా తెలంగాణలో ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. షర్మిల పార్టీతో వైసీపీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

అటు షర్మిలతో వైసీపీకి ఉన్నవి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది ఏమీ లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు, సమన్వయం ఉండాలని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story