సలాం కుటుంబసభ్యులను సీఎం పరామర్శించిన తీరు భయపెట్టేలా ఉంది : సలాం న్యాయ పోరాట కమిటీ

సలాం కుటుంబసభ్యులను సీఎం పరామర్శించిన తీరు భయపెట్టేలా ఉంది : సలాం న్యాయ పోరాట కమిటీ
X

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించిన తీరు భయపెట్టేలా ఉందని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం 25లక్షల రూపాయలు ఇచ్చి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే కుదరదని తేల్చిచెప్పారు. సలాం కుటుంబసభ్యుల ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల కాల్ డేటా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.


Tags

Next Story